బనవాసి: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి ఎమ్మిగనూరు మండలం బనవాసి కేవీకే సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడివెళ్ల గ్రామానికి చెందిన బోయ వెంకట్రాముడు (43) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆదోనిలో పనిచేసి, పండుగ కోసం ఇంటికి కాలినడకన వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్సై శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.