శ్రీశైలం నియోజకవర్గం లోని ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలంలో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొక్కజొన్న, పత్తి, సోయాబీన్స్, మినుము, పంటల్లో నీటి మునిగి వందలాది ఎకరాలు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మొక్కజొన్న పంట కోతకొచ్చే దశలో నీట మునిగి కోయలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొక్కజొన్న కోసిన రైతులు మొలక వచ్చి వ్యాపారులు కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు.