బలవంతపు భూసేకరణను ఆపాలని కోరుతూ ఈనెల 24న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఆదివారం అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఆర్లే, గుల్లేపల్లి, గరుగుబల్లి, చింతపాలెం గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న, రైతు సంఘం జిల్లా కోశాధికారి గండినాయన్ బాబు, యర్రా దేముడు, వి. సూర్యనారాయణ, ఇర్లే నాయుడుబాబులతో కలిసి మాట్లాడుతూ, బలవంతంగా రైతు కూలీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.