సీఎం రేవంత్ రెడ్డి వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు ఇచ్చిన హామీను వెంటనే నెరవేర్చాలని వికలాంగుల వృద్ధుల వితంతుల ఒంటరి మహిళల పెన్షన్లు వెంటనే పెంచాలని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గత గల ప్రశాంత్ మాదిగ మహాజన అసోసియేషన్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆనంద్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పెన్షన్ దారులకు ఇచ్చిన హామీలను సీఎం వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు 20 నెలలు గడిచిన పెన్షన్ హామీ ఇంకా నెరవేర్చలేదని అన్నారు.