పెదచెర్లోపల్లి పోలీస్ స్టేషన్ ను కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. మిస్సింగ్ కేసులు మరియు పాత పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక ఎస్సై జి కోటయ్యకు డీఎస్పీ ఆదేశించారు. నేర నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో కనిగిరి సీఐ ఖాజావలితో కలిసి డీఎస్పీ మొక్కలు నాటారు.