అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని మండలాల్లో మంగళవారం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాలను వైయస్సార్సీపి శ్రేణులు నిర్వహించారు. ఉరవకొండ పట్టణ కేంద్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బెలుగుప్ప కూడేరు విడపనకల్లు వజ్రకరూరు మండలాల్లోని వైయస్సార్ విగ్రహాలకు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు.