మద్యం సేవించి డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్న యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించిన బార్ షాపు నిర్వాహకులు సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది.. బార్ షాప్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని ఓ బార్ షాపులో కొత్తగూడెం కి చెందిన ఐదుగురు యువకులు 6000 రూపాయలు మద్యం సేవించి డబ్బులు ఇవ్వకుండా పారిపోతుండగా బార్ షాప్ నిర్వాహకులు గమనించి ముగ్గురు యువకులను పట్టుకొని పట్టణ పోలీస్ లకు అప్పగించారు.. మరో ఇద్దరి యువకులు పారిపోయినట్లు బార్ షాప్ నిర్వాహకులు తెలిపారు పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది..