ఆర్టీసీ బస్సుల ద్వారా నేత్రదానం సేకరణకు TG srtcకొత్త అడుగు వేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. 'నెట్వర్క్ టూ సైట్' పేరుతో సరోజినిదేవి కంటి ఆస్పత్రితో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో సేకరించిన నేత్రాలను ఉచితంగా తమ బస్సుల్లో HYDకు తీసుకురానున్నారు. ఈరోజు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. మోధినితో కలిసి ఒప్పంద పత్రాలపై సజ్జనార్ సంతకాలు చేశారు.