హనుమంతుని పాడు: భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ హనుమంతునిపాడులో తహసిల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... హనుమంతునిపాడు మండలంలోని 23 పంచాయితీలలో 600 మంది భవన నిర్మాణ కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వారికి సంక్షేమ బోర్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదన్నారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు.