కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ లు మంగళవారం దిష్టిబొమ్మలను దగ్ధం చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్రం యూరియా సరఫరా లో రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ ధర్నా నిర్వహించి మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో అగ్రహించిన బిజెపి నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ వ్యక్తానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు బిజెపి పార్టీ నాయకులకు మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకరు ఒకరు పరస్పరం దూషించుకుంటూ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.