బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అక్కడి గుండా నియోజకవర్గ పర్యటనలో వెళ్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఘటనను గమనించారు. గాయపడిన బాధితుడిని గుర్తించిన ఆయన వెంటనే తన సిబ్బందితో కలిసి ప్రధమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తన సొంత వాహనంలో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు మదనపల్లె వాసిగా గుర్తించారు.