కురబలకోటకు 180 క్వింటాళ్ల మొక్కజొన్న వర్షాకాలం దృష్ట్యా పాడిరైతుల, పశువుల మేత కోసం ప్రభుత్వం సబ్సిడీ మొక్క జొన్న విత్తనాలను పంపిణీ చేస్తోందని పశు వైద్యాధికారి నవీన్ కుమార్ తెలిపారు. శుక్రవారం అంగళ్ళు, పశు వైద్య కేంద్రంలో రాయితీ మొక్కజొన్న విత్తనాల పంపిణీని ప్రారంభించారు. మండలానికి 180 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయన్నారు. అవసరమైన రైతులు భూమి పాసు పుస్తకం, ఆధార్ కార్డుతో స్థానిక పశు వైద్య శాలల్లో సంప్రదించాలన్నారు.