అంతుచిక్కని వ్యాధి సోకి దేశి కోళ్లతో పాటు, బాయిలర్ కోళ్లు కూడా మృత్యువాత పడుతున్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని రామలింగపురంలోని ఓ ఫార్మ్ లో 10 రోజుల్లో 40 వేల దేశీ కోళ్లు వింత వ్యాధితో మృతి చెందాయి. కొత్తవలస, ఎల్.కోట మండలంలో దాదాపు లక్ష పైనే కోళ్లు చనిపోయినట్లు పశు వైద్యాధికారులు ధ్రువీకరించారు. వ్యాధి నిర్ధారణ కోసం శాంపిల్స్ ను విజయవాడ పంపించినట్లు కొత్తవలస ప్రాంతీయ సహాయ సంచాలకుడు కన్నం నాయుడు మంగళవారం తెలిపారు.