ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ మరియు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం తో వరద నీటితో మంచిర్యాల పట్టణం ఎన్టీఆర్ నగర్ మరియు రామ్ నగర్ లో వరద నీరు ఇండ్లలోకి చేరడంతో శనివారం మధ్యాహ్నం వరద ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ , బీజేపీ నాయకులు సందర్శించి నీట మునగిన ఇండ్లను పరిశీలించి బాధిత ప్రజలను పరామర్శించరు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్ణయించిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వలన గత నాలుగు సంవత్సరాలుగా మంచిర్యాల పట్టణం బ్యాక్ వాటర్ మునిగి ప్రజలు తీవ్ర నష్టపోయారని అన్నారు