ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ చెరువు తెగిపోవడంతో వరద ప్రభావానికి గురైన తిమ్మాపూర్ తాండ రోడ్డులోని కల్వర్టును స్థానిక యువకులు, గ్రామస్తులు తమ సొంత ఖర్చుతో మరమ్మతులు చేశారు. శ్రీనివాస్ గౌడ్, అరవింద్, రవీందర్, నర్సింలు, సాయిబాబు, సంగమేశ్వర్, గంగారాంతో పాటు మరికొంతమంది యువకులు, గ్రామస్తులు కల్వర్టులో పైపులు వేసి, మోరం వేయించి రాకపోకలకు వీలు కల్పించారు. ఈ మరమ్మతులకు సుమారు 60 నుండి 80 వేల వరకు ఖర్చు చేశారు.