యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా అంచనా విలువ 14.50 లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణానికి ఎమ్మెల్యే మందుల సామేలు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ అడ్డగూడూరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ప్రభుత్వ పాఠశాలలోని మౌలిక సహకారాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.