పలమనేరు: శాసనసభ్యులు అమర్నాథరెడ్డిని గంగవరం మండలం ఆలకుప్పంనకు చెందిన రాజన్న స్థానిక పార్టీ కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించారు. పలమనేరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తన పేరును ఖరారు చేయడంతో స్థానిక శాసనసభ్యులను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి కులస్తులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేను మరియు రాజన్నను సన్మానించారు. నియోజకవర్గంలో వాల్మీకులకు ఏఎంసీ చైర్మన్ పదవిని కేటాయించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్, గంగ