అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం బాల్య వివాహాలు నిరోదించడంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జడ్జి రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ గ్రామస్థాయిలోను ఇదేవిధంగా మండల స్థాయి జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు చేసి బాల్య వివాహాలను తక్షణమే నిరోధించాలని తెలియజేశారు. బాల్య వివాహాల నిరోధించడానికి జీవో 31, 39 ఆవశ్యకతను వివరించారు.