యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, జూలూరు వద్ద ఎగువన కురిసిన భారీ వర్షాలకు మూసీ నది లో లెవెల్ బ్రిడ్జి పై నుండి ఉదృతంగా ప్రవహిస్తుంది. శుక్రవారం సాయంత్రం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగువన కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున పోచంపల్లి-బీబీనగర్ కు రాకపోకలు బంద్ అయ్యాయి. పోలీసులు ఇరువైపులా బారిగేట్లను ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితులలో వాహనదారులు మూసినది దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.