ఓ సామాజిక వేత్త కరీంనగర్ లో బుధవారం మధ్యాహ్నం 3గంటలకు వినూత్న నిరసన తెలియజేశాడు. కొన్నేళ్లుగా నగర శివారులోని రేకుర్తి చౌరస్తాలోగల రోడ్డు అధ్నాన్నంగా మారింది. ఇట్టి రోడ్డును పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డుపై బురదలో భైఠాయించి నిరసన తెలియజేశారు. కరీంనగర్ కు చెందిన సామాజిక వేత్త కోట శ్యామ్ కుమార్ రేకుర్తి రోడ్డును బాగుచేయాలంటూ వినూత్నంగా రోడ్డుపై బురదలో కూర్చున్నారు. తాము అన్నీ ట్యాక్స్ లు కడుతున్నామని ఇన్నేళ్లుగా రోడ్డును ఎందుకు బాగుచేయడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా రోడ్డును బాగు చేయనందుకుగానూ తనకే జరిమానా చెల్లించాలని కోరుతున్నారు.