ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దగుడిపాడు గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ 108 అంబులెన్స్ లో ఆదివారం ప్రసవమైంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గడిపిన మహిళకు చెందిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలో గర్భిణీ మహిళకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్ సిబ్బంది మహిళకు పురుడు పోశారు. పండంటి బిడ్డ పుట్టాడని తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.