వ్యక్తి అదృశ్యమైన ఘటనపై దమ్మపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం దమ్మపేటకు చెందిన తల్లి బోయిన రాము (30) స్థానికంగా కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న భూమి అమ్మగా వచ్చిన 1,70,000 తీసుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎంతకు అతని ఆచూకీ కనుగొనక పోవడంతో రాము భార్య స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రాము ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.