అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి వద్ద ఉన్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినిలకు మానవ విలువలు వృత్తి నైతికపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మోటివేటర్ క్రియేటర్ కృష్ణ మాట్లాడుతూ మానవ జీవితాన్ని సార్థకత చేసేది మానవ విలువలు వృత్తి జీవితాన్ని గౌరవప్రదంగా నిలబెడుతుందని ఈ రెండు కలిసినప్పుడే సమాజంలో న్యాయం,శాంతి ,అభివృద్ధి స్థిరత్వం ఉంటుందని విద్యార్థినిలు ఈ విషయాన్ని గుర్తించుకొని విలువలను దృష్టిలో ఉంచుకొని విద్యని అభ్యసించాలని మోటివేటర్ క్రియేటర్ కృష్ణ పేర్కొన్నారు.