ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.గురువారం వేములవాడ పట్టణంలో శ్రీవాసవి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాజశ్యామల దేవి కుంకుమ పూజ, పల్లకి సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని,దేవా,దేవి అమ్మవార్ల దీవెన్లతో అందరు సంతోషంగా ఉండాలని అన్నారు.దేవి నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు.