నేటి నుంచి మూడు రోజులు పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ బుధవారం తెలిపారు. మూడు రోజులు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీస్ అధికారులు సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని, వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే ఆర్గనైజర్లు కార్యవర్గ సభ్యులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా కరెంట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లాలో వర్షాలతో ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్