అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఉప్పర వీధిలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన లడ్డూ వేలం పాట పోటాపోటీగా జరిగింది. హిందూపురం నియోజకవర్గం పరిగి మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన ఉప్పర ఓజస్వి, s/o ఉప్పర లక్ష్మి నరసింహమూర్తి లడ్డూ వేలంపాటనురూ. 44,516పడటం జరిగింది. స్వామివారి కండువాను రూ.18116 ఉప్పర లోక్ నాథ్ లు దక్కించుకోవడంతో విగ్రహ దాత ఉప్పర శివశంకర్ ఉప్పర వీధి వినాయక ఉత్సవ సమితి సభ్యులు రాజేష్ కుమార్, అనిల్ కుమార్ వేలంపాటదారులను ఘనంగా సన్మానించి తదుపరి స్వామి వారి నిమజ్జన కార్యక్రమానికి వెళ్లారు.