అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ రైల్వే బుకింగ్ కార్యాలయం ఎదుట రైల్వే కార్మికులు, ఉద్యోగులు వినాయక నిమజ్జనం సందర్భంగా దోష నివారణకు వినూత్న రీతిలో గుంజీలు తీశారు. ఆదివారం ఐదవ రోజు నిమజ్జనం సందర్భంగా కమిటీ సభ్యులు ఉత్సవాలు ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు తమ ద్వారా అనుకోకుండా ఏవైనా తప్పులు జరిగి ఉంటే గణనాథుడు మన్నించాలని 21 గుంజీలు తీశారు. గుంజీలు తీసి భక్తి భావం చాటుకున్న వారిని స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.