మాధవధార సచివాలయంలో పనిచేస్తున్న కమల కుమారి అని మహిళా బంధువుల శుభకార్యముల నిమిత్తం విజయవాడ వెళ్లి వస్తుండగా తన బ్యాగులోని సుమారు నాలుగు తులాలు బంగారు నగలు 50,000 -/-రూపాయల నగదు చోరీ అయినట్టు ద్వారక నేర విభాగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు ఆదేశాల మేరకు ద్వారక క్రైమ్ సీఐ చక్రధర్ రావు ఆధ్వర్యంలో ఎస్సై అప్పలరాజు రంగంలోకి దిగి మద్దిలపాలెం బస్ డిపోలో తనిఖీ చేయగా బస్సులో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం రుజువైనందుకు అరెస్టు చేశామని బుధవారం సాయంత్రం పోలీసులు తెలిపారు.