మహబూబాబాద్ పట్టణంలోని బాబు జగ్జీవన్ రావ్ జంక్షన్ వద్ద యూ టర్న్ తీసుకుంటున్న ప్రైవేట్ స్కూల్ బస్సును అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్సులో ఉన్న 35 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. స్కూల్ బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి బుధవారం ఉదయం 11:00 లకు తెలిపారు. పట్టణంలో ఎవరైనా వాహనాలు అతివేగంగా నడిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.