సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి గ్రామ శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ధర్మకర్త అశోక్ గౌడ్, పర్యవేక్షణలో సోమయ్య ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.