పలమనేరు: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద మొదట హైకోర్టు న్యాయవాది కిరణ్ మరియు అతని భార్య తెలిపిన సమాచారం మేరకు, గోవింద శెట్టి వద్ద నగదు తీసుకొని ఉన్నాము వడ్డీ కట్టలేదని చెప్పి నేడు వారి కుమారుడు హేమంత్ మరియు వారి అనుచరులు సుమారు 30 మంది వరకు మా ఇంటి పై దాడి చేసి నాకు రక్త గాయాలు అయ్యేటట్లు కొట్టారు. చుట్టుపక్కల వారు వచ్చినా కూడా వారిని భయభ్రాంతులకు గురిచేసి మమ్మల్ని తీవ్ర పదజాలంతో దూషించారు, దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నామన్నారు. ఘటనపై నిజా నిజాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.