అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండు కుండలా మారింది. గత రెండు రోజులుగా గుత్తి, గుత్తి అర్ఎస్ తో పాటుగా ఎగువన ఉన్న నంద్యాల, కర్నూలు జిల్లాలలో భారీగా వర్షాలు కురవడంతో దిగువన ఉన్న గుత్తి చెరువులోకి పెద్ద వంక, ఉప్పు వంక, కాలువల ద్వారా భారీగా వర్షం నీళ్ళు చేరాయి. దీంతో మరువ పొంగి పొర్లుతోంది. విషయం తెలుసుకున్న గుత్తి పట్టణానికి చెందిన మత్స్యకారులు, ప్రజలు శుక్రవారం అక్కడికి చేరుకొని గంగ పూజలు చేశారు. చెరువు వద్ద టెంకాయ కొట్టి గంగమ్మకు హారతులు ఇచ్చారు.