యాడికి మండలంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వేములపాడు వద్ద పెద్దవంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంక దాటేందుకు ప్రయత్నించిన వ్యాన్ చిక్కుకుంది. గ్రామస్థులు ట్రాక్టర్ సహాయంతో వ్యాన్ను ఒడ్డుకు చేర్చారు.