తెలంగాణ రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అల్లుడు మృతి చెందగా.. సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చిన్నకోడూరు లో మృత దేహానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతి పట్ల హరీష్ రావు సంతాపం వ్యక్తం చేసారు. ఎదిగే వయస్సు కొడుకుని కోల్పోయిన తల్లి తండ్రులను, శోక సంద్రం లో ఉన్న కుటుంబాన్ని ఓదార్చారు. అధైర్య పడొద్దని మనోధైర్యాన్ని ఇచ్చారు...