కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ అంటూ కేటీఆర్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటుగా విమర్శించారు. గాంధీ భవన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం కలిసి సోనియా గాంధీని కలవలేదని ప్రశ్నించారు. సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంతోనే రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం రాజకీయంగా లబ్ధి పొందిందని గుర్తు చేశారు.