సంగారెడ్డి పట్టణంలో బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ శిక్షణ తరగతులను సద్వినియం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పేర్కొన్నారు. సోమవారం బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సంగారెడ్డిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ఒక లక్ష్యంతో కష్టంతో పాటు ఇష్టంతో చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్లు పాల్గొన్నారు.