ముదిగుబ్బ మండల కేంద్రంలో సోమవారం సీపీఎం నాయకులు ఆటో కార్మికులకు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.మండల కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అమలుపరచినప్పటి నుండి ఆటో కార్మికులు వీధిన పడ్డారన్నారు.కనీసం నెలవారీ కంతులు కట్టుకోవడానికి కూడా గిట్టుబాటు కావడం లేదని ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మికులకు రూ.25000 అందించాలన్నారు.