మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ర్యాలీ గ్రామ పంచాయతీ పరిధిలోనీ జొన్నలరాశి సమీపంలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఆవు మృతి చెందింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ర్యాలీ గ్రామపంచాయతీ పరిధిలోని జొన్నల రాశి సమీపంలో పశువుల మంద వద్ద అరికెల రాజు అనే పశువుల కాపారి మందతో పాటు రాత్రి అక్కడ నిద్రిస్తున్నాడు శనివారం తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు పెద్దపులి వచ్చి మందలో నుంచి ఆవును తీసుకువెళ్లి ఆవుపై దాడి చేసిందని రాజు తెలిపాడు