మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామంలో జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పది నెలల క్రితం వివాహమైన యువతిని కట్నం కోసం అత్తమామలు హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆమె స్వగ్రామం హన్వాడ మండలం కొత్తపేట వాసులు ఆందోళన చేపట్టారు.