బీజేపీ ఓట్ చోరీ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. ఓట్ చోరీ కాదు రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయ్యిందని అందుకే కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం నిజమాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి సభ్యుల సమావేశం ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్‌లో 10% మైనార్టీలకు ఇవ్వాలని కుట్రలు చేస్తోందన్నారు.