ఏడేళ్లలో జరిగిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని.. మరో ఏడాదిలో వైఎస్ఆర్ కడప జిల్లాను జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు.ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల్లో ఆరు విభాగాల్లో లక్ష్యాలను సాధించిన నేపథ్యంలో.. సంబంధిత భాగస్వామ్య శాఖల అధికారులు, ఫ్రెంట్ లైన్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ.. శనివారం కడప మాధవి కన్వెన్షన్ హాలులో "సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమం" ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తోపాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య హాజరయ్యారు.