ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. దాదాపు నెల రోజులుగా ప్రవాహం తగ్గకుండా వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జూరాల ప్రాజెక్టు నుంచి శనివారం మధ్యాహ్నం 21 గేట్లు, 6 పవర్ హౌస్ యూనిట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో 1,82,966 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తుంది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు