శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సర్వే నం. 17లోని 12 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురికావడంతో, ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీతో పాటు ఫెన్సింగ్ను జేసీబీ సహాయంతో తొలగించారు. ఉదయం నుంచి ఈ కూల్చివేతలు చేపట్టారు