ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్ లోని కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.