తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలలలో పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు.జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీకి తరగతుల ప్రారంభించడానికి ప్రభుత్వము నుండి అనుమతి వచ్చిన సందర్భంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ ఈ 21 పాఠశాలల పరిధిలోని నాలుగు సంవత్సరాలు నిండిన బాల బాలికలను ప్రీ ప్రైమరీ తరగతులలో జరిపించడానికి మండల విద్యాశాఖ అధికారులు,ఐసిడిఎస్ అధికారులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.