ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ లో సరిపడ బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.డిపోకు సంబంధించి బస్సులన్నిటిని సూపర్ సిక్స్ సభ కోసం కేటాయించారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్ లో గంటలకొద్దీ బస్సుల కోసం వేచి చూశారు. అందుబాటులో ఉన్న బస్సుల్లో సామర్థ్యం కంటే ఎక్కువగా ప్రయాణికులు ఉండడంతో వృద్ధులు మహిళలు ఇబ్బందులు పడ్డారు.