అనంతపురం జిల్లా గుత్తి పట్టణంకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గుర్రం జాషువా 130వ జయంతి, మరియు భగత్ సింగ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యదర్శి రామ్మోహన్, కోశాధికారి జెన్నే కుళ్ళాయిబాబు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముందుగా గుర్రం జాషువా, భగత్ సింగ్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు మాట్లాడుతూ గుర్రం జాషువా తండ్రి యాదవ కులము కాగా తల్లి దళితురాలన్నారు. తండ్రి మాత్రం మతం మారి ఫాస్టర్ గా పని చేశారన్నారు.