ప్రభుత్వం 90% సబ్సిడీ ద్వారా గిరిజన రైతులకు అందిస్తున్న రాజ్మా విత్తనాలకు గురువారం పెదబయలు మండలం అడుగుల పుట్టు రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. ఒక్కో సచివాలయానికి 2 క్వింటాళ్ల చొప్పున ప్రభుత్వం విత్తనాలు కేటాయించింది. అవి సరిపోకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు పొందేందుకు రైతులు తొక్కిసలాడుతూ అవస్థలు ఎదుర్కొన్నారు.