భారీ వరదలకు వాగులో కొట్టుకుపోయి ప్రాణాలతో భయటపడి మృత్యుంజయుడుగా నిలిచాడు శంకర్ అనే వ్యక్తి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ధన్నూర్ వాగులో దాటుతున్న క్రమంలో బుధవారం రాత్రి వరద ఉధృతి పెరగడంతో శంకర్ అనే వ్యక్తి వరద ఉధృతికి వాహనంతో పాటు కొట్టుకుపోయాడు. కొద్ది దూరం వెళ్ళాక చెట్టు కొమ్మను పట్టుకొని ఈత కొడుతూ అవతలి వైపుకి చేరి ప్రాణాలతో బయటపడగా, వాహనం వరదల్లో కొట్టుకుపోయింది.