అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం గోపీదిన్నె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కోటాల గ్రామానికి చెందిన భరత్ సోమవారం మధ్యాహ్నం భోజనం సమయంలో బాత్రూం కు వెళ్లగా. గోడ కూలిపోయి భరత్ పై పడటంతో భరత్ త్రీవంగా గాయపడ్డాడు. వెంటనే ఉపాధ్యాయులు భరత్ ను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించి తల్లిదండ్రులకు సమాచారం తెలిపారు.